Murder : కడప జిల్లాలో ప్రేమ పేరిట ఓ ఉన్మాది అరాచకం.. యువతి గొంతుకోసి చంపిన వైనం

|

Jun 19, 2021 | 12:18 AM

కడప జిల్లాలో ఓ ఉన్మాది ప్రేమ పేరిట అరాచకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందంటూ యువతి గొంతు కోసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే, బద్వేలు మండలం..

Murder : కడప జిల్లాలో ప్రేమ పేరిట ఓ ఉన్మాది  అరాచకం..  యువతి గొంతుకోసి చంపిన వైనం
Sirisha
Follow us on

Kadapa lady murder : కడప జిల్లాలో ఓ ఉన్మాది ప్రేమ పేరిట అరాచకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందంటూ యువతి గొంతు కోసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే, బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మకు 18 ఏళ్ల కూతురు శిరీష ఉంది. ఆమె బద్వేల్ వీరారెడ్డి కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత కొంత కాలంగా చరణ్ అనే యువకుడు శిరీషను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు. ప్రస్తుతం కాలేజీ సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది శిరీష.

ఈ క్రమంలో శుక్రవారం చింతల చెరువు గ్రామంలోకి వెళ్లి శిరీషను బలవంతం చేశాడు చరణ్. అందుకు ఆమె నిరాకరించడంతో కూడా తెచ్చుకున్న కత్తితో శిరీష గొంతు కోశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న శిరీష అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన గ్రామస్తులు నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టి చితకబాది.. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గ్రామస్తుల దెబ్బలకు స్పృహ కోల్పోయినట్టున్న చరణ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

Read also : Concrete mixer lorry : కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ బీభత్సం.. ఒక ట్రాక్టర్, రెండు బైక్ లను ఢీకొనడంతో నలుగురు మృత్యువాత