గంజాయి మత్తులో బస్టాండ్‌లో యువకుడి వీరంగం.. పరుగులు పెట్టిన జనం.. చివరకు.. షాకింగ్ వీడియో..

Young man attacked passengers: ఫుల్లుగా గంజాయిని పీల్చాడు.. ఆ తర్వాత మత్తులో వీరంగం సృష్టించాడు. ఇదంతా ఎక్కడో పల్లెటూరులో జరగలేదు.. జనసంచారం ఉన్న

గంజాయి మత్తులో బస్టాండ్‌లో యువకుడి వీరంగం.. పరుగులు పెట్టిన జనం.. చివరకు.. షాకింగ్ వీడియో..

Updated on: Aug 14, 2021 | 12:37 PM

Young man attacked passengers: ఫుల్లుగా గంజాయిని పీల్చాడు.. ఆ తర్వాత మత్తులో వీరంగం సృష్టించాడు. ఇదంతా ఎక్కడో పల్లెటూరులో జరగలేదు.. జనసంచారం ఉన్న ఓ పట్టణంలోని బస్టాండ్‌లో జరిగింది. నిందితుడు సృష్టించిన వీరంగానికి ప్రజలకు ఏం అర్థంకాక పరుగులు తీశారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై నగర బస్టాండ్‌లో శుక్రవారం జరిగింది. గంజాయి మత్తులో ఉదయం వేళ ఓ యువకుడు అకస్మాత్తుగా వీరంగం సృష్టించాడు.
యువకుడి ప్రవర్తనతో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. యువకుడు ఒక్కసారిగా ఇనుప రాడ్‌ చేతులో పట్టుకుని.. కూర్చీలను, అక్కడున్న వస్తువులను ధ్వంస చేశాడు. అంతేకాకుండా ప్రయాణికులు, బస్టాండ్లో వ్యాపారం చేసుకుంటున్న వారిపై దాడి చేశాడు. అయితే.. అక్కడున్న వారికి ఏం అర్ధంకాక పరుగులు తీశారు.

కొంతసేపటి తర్వాత బస్టాండ్ సిబ్బంది, వ్యాపారులు అతికష్టం మీద యువకుడిని పట్టుకుని కొట్టారు. అనంతరం యువకుడిని బంధించి పోలీసులకు అప్పగించారు. అయితే.. బస్టాండ్ పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయాలు భారీగా పెరిగాయని స్థానికులు పోలీసులకు వెల్లడించారు. యువకులకు గంజాయి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.

వైరల్ వీడియో..

 

Also Read:

Netflix: ఢిల్లీ హైకోర్టులో నెట్‌ఫ్లిక్స్‌కు చుక్కెదురు.. బాలుడి మర్డర్ డాక్యుమెంటరీ ప్రసారానికి బ్రేక్..

Lovers Death: కారులోనే అగ్నికి ఆహుతైన ప్రేమజంట.. అసలేమైందంటే..?