Hyderabad Businessman Kidnap: హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఎల్బీనగర్లోని కైఫ్ ట్రేడర్స్ యజమాని ఆరిఫ్ అక్బర్‌ను శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది కిడ్నాప్ చేశారు. డిఫెన్స్ కాలనీలోని ఆరిఫ్ ఇంటికి వచ్చిన దాదాపు పది మంది దుండగులు కారులో తీసుకెళ్లారు. కిడ్నాప్ అనంతరం మరో కారులో వచ్చిన కొంతమంది షాప్‌లోకి చొరబడి రూ.50 లక్షల విలువైన ఉడ్‌ను తీసుకెళ్లారు. ముందుగా సీసీ కెమెరాలను ఆఫ్ చేసి.. ఆనంతరం లక్షల విలువైన ఉడ్ ను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు పలు వివరాలు సేకరించారు.
కేసు నమోదు చేసుకోని 6 ప్రత్యేక బృందాలతో కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌కి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: