Women Cheating భ‌ర్తతో గొడ‌వ‌పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య‌.. ఆమె పెట్టె చెక్ చేసి అత‌డు కంగుతిన్నాడు

ఏపీలో నిత్యపెళ్లికూతురు వ్యవహారం వెలుగు చూసింది. తిరుపతిలో ప్రేమపేరుతో ఓ యువతి మూడో పెళ్లి చేసుకుని అందినకాడికి దోచుకుని ఉడాయించింది...

Women Cheating భ‌ర్తతో గొడ‌వ‌పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య‌.. ఆమె పెట్టె చెక్ చేసి అత‌డు కంగుతిన్నాడు
Clash With Husband

Updated on: Jun 13, 2021 | 12:10 PM

ఏపీలో నిత్యపెళ్లికూతురు వ్యవహారం వెలుగు చూసింది. తిరుపతిలో ప్రేమపేరుతో ఓ యువతి మూడో పెళ్లి చేసుకుని అందినకాడికి దోచుకుని ఉడాయించింది. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. చిత్తూరు జిల్లాలోని విజయపురం మండలానికి చెందిన యువకుడు.. ఐదేళ్లుగా మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తిరుపతిలోని సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తిరుపతిలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే సుహాసినితో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. తాను అనాథనని సుహాసిని యువకుడికి చెప్పింది. దాంతో అతను తన కుటుంబ సభ్యులను ఒప్పించి గతేడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్నాడు.

అయితే, జూన్‌ 7వ తేదీన సునీల్‌తో గొడవపడిన సుహాసిని.. ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా అతనికి ఇంట్లోని పెట్టెలో ఆమె ఆధార్ కార్డు లభించింది. దాని ఆధారంగా ఆరా తీయగా నెల్లూరు జిల్లా కోనేటిరాజపాళేనికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహమై ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలిసింది. ఏడాదిన్నర క్రితం రెండో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఫొటోలు కూడా బయటపడ్డాయి. దీంతో యువకుడు తిరుపతిలోని అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. మంచిగా నటిస్తూనే తన వద్ద 6లక్షల వరకు దోచుకున్నట్లు బాధితుడు తెలిపాడు.

Also Read: యువతి ఆత్మహత్య.. రేపిస్టుని పట్టించిన వీర్యకణాలు

ఈ పొగతో కరోనా పరార‌వుతుంద‌ట‌.. అమలాపురంలో వైర‌స్ కట్టడికి వినూత్న ప్రయత్నం

Loading...
Unable to load recommendations.
Follow Us