AP Crime News: మహిళల పొదుపు నిధులను మింగేశారు.. ఏకంగా కోటి 75లక్షలు కాజేశారు…!

|

Mar 28, 2021 | 4:06 PM

పొదుపు మహిళల నిధులను పక్కదారి పట్టించారు. గ్రామైక్య సంగాల లీడర్లు, అధికారులు కుమ్మక్కై.. ఏకంగా కోటి 75లక్షలు కాజేశారని ఆరోపిస్తూ..

AP Crime News: మహిళల పొదుపు నిధులను మింగేశారు.. ఏకంగా కోటి 75లక్షలు కాజేశారు...!
Funds Cheating
Follow us on

పొదుపు మహిళల నిధులను పక్కదారి పట్టించారు. గ్రామైక్య సంగాల లీడర్లు, అధికారులు కుమ్మక్కై.. ఏకంగా కోటి 75లక్షలు కాజేశారని ఆరోపిస్తూ.. బాధిత మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చిత్తూరు రూరల్‌ మండలంలో వెలుగు చూసింది.

గత కొన్నేళ్లుగా మహిళల పొదుపు సొమ్మును ఆడిట్ చేయించకుండా సంఘాల లీడర్లు, సిబ్బంది కాజేసినట్లుగా మహిళలు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. నిధుల గోల్ మాల్ పై ఎన్ ఆర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యంతో యంత్రాంగం కదిలింది. ముమ్మర దర్యాప్తు మొదలుపెట్టారు.

తాలంబేడుతో పాటు మరో 6 గ్రామాల్లోని 36 పొదుపు సంఘాలకు చెందిన నిధులు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. పొదుపు సొమ్మును బ్యాంక్ లో డిపాజిట్ చేయకుండా ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు రశీదులతో మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. చిత్తూరు రూరల్ మండలం పొదుపు సంఘాల ఏపియం, సిసి, సంఘ మిత్రాల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: అందమైన ద్వీపం.. ప్రమాదకర నేరస్థుల ఖైదు స్థలం.. షాకింగ్ నిజాలు

ఐపీఎల్​ అభిమానులకు గుడ్ న్యూస్. అక్కడి మ్యాచ్​లపై క్లారిటీ వచ్చేసింది