Women Cheated Old Man : సులువుగా డబ్బు సంపాదించడానికి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. కొత్త కొత్త పద్ధతులలో జనాలను మోసం చేస్తున్నారు. తాజాగా ముంబైలో ఓ బ్యాంకు ఉద్యోగిని డబ్బులున్న ఓ వృద్ధుడికి మాయ మాటలు చెప్పి కోటి రూపాయలు ఎగరేసుకుపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముంబైలోని మలద్ ప్రాంతంలో నివసించే 73 ఏళ్ల జెరాన్ డిసౌజా 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించాడు. దీంతో వచ్చిన రూ. 2 కోట్లను ప్రైవేట్ బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేశాడు. అయితే 2019లో ఫిక్సిడ్ డిపాజిట్ దానిపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈ విషయాన్ని బ్యాంకు ఉద్యోగిని షాలినీ గమనించి ఒంటరిగా ఉన్న వృద్ధుడిని టార్గెట్ చేసి డబ్బు దోచేయాలని పథకం వేసింది. అనుకున్నదే తడువుగా ఆ వృద్ధుడితో పరిచయం చేసుకొని వివాహం చేసుకుంటానని నమ్మబలికింది. అంతేకాకుండా ఇద్దరు కలిసి రోజూ రెస్టారెంట్లకు, హోటళ్లకు, షికార్లకు తిరిగారు. దీంతో ఆ వృద్ధుడు షాలిని ని నమ్మడం మొదలెట్టాడు.
ఇంతలో ఓ రోజు తానొక వ్యాపారం ప్రారంభిస్తున్నానని అందులో పెట్టుబడికి కొంతమొత్తం కావాలని జెరాన్‌ను కోరింది. లాభాలను షేర్ చేసుకుందామని చెప్పింది. అయితే కాబోయే భార్యే కదా అనుకొని ఆమె అకౌంట్‌కు పెట్టుబడి కింద రూ.1.3 కోట్ల రూపాయలను ట్రాన్స్‌ఫర్ చేశాడు. అంతే నగదు తన అకౌంట్లో పడగానే షాలినీ ఫోన్ స్విచ్ఛాప్ చేసింది. జెరాన్ ఆమెను కలుసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు షాలినీ కోసం వేట మొదలు పెట్టారు.
మరిన్ని వార్తలు చదవండి..
Cheating: భాగ్యనగరంలో నయా మోసం.. పోలీసులమంటూ వచ్చారు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.. ఆపై..
సామాజిక సేవ పేరుతో మోసం.. 3 కోట్ల రూపాయలు వసూలు.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు