Crime News: మరో ఘోరం.. యువతిపై గ్యాంగ్ రేప్.. మద్యం తాగించి దారుణంగా..

|

Sep 30, 2021 | 8:27 AM

Nizamabad Crime News: కఠిన చట్టాలు అమలవుతున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కేసులు వెలుగులోకి వస్తూనే

Crime News: మరో ఘోరం.. యువతిపై గ్యాంగ్ రేప్.. మద్యం తాగించి దారుణంగా..
Crime News
Follow us on

Nizamabad Crime News: కఠిన చట్టాలు అమలవుతున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నలుగురు యువకులు డిగ్రీ చదువుతున్న ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి మద్యం తాగించి మృగాల్లా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగింది. విద్యార్థిని అరుపులు విన్న సెక్యూరిటీ సిబ్బంది.. పోలీసులకు ఫోన్‌ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేశారు.

మంగళవారం రాత్రి సమచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను సఖి కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. యువతికి బలవంతంగా మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

డిగ్రీ చదువుతున్న యువతిని నలుగురు యువకులు బస్టాండ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రికి బలవంతంగా తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే.. పక్కనే ఉన్న షాపింగ్‌ నిర్వాహకులు యువతి అరుపులు విని 100కు డయల్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ ఘటన నిజామాబాద్‌లో కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read:

Inzamam-ul-Haq: గుండెపోటు కాదు.. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళితే.. ఇలా జరిగింది: ఇంజమామ్

AP Crime News: భార్య, అత్తమామ వేధింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్న అల్లుడు..