వాటర్‌ హీటర్‌ ఆన్‌చేస్తూ… షార్ట్ సర్క్యూట్‌తో మహిళ మృతి

ఏలూరులో విషాద సంఘటన చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మహిళ మృత్యువాతపడింది. వేడి నీళ్ల కోసం వాటర్‌ హీటర్‌ ఆన్‌ చేసిన మహిళకు కరెంట్‌ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

వాటర్‌ హీటర్‌ ఆన్‌చేస్తూ... షార్ట్ సర్క్యూట్‌తో మహిళ మృతి

Updated on: Jul 16, 2020 | 12:15 PM

ఏలూరులో విషాద సంఘటన చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మహిళ మృత్యువాతపడింది. వేడి నీళ్ల కోసం వాటర్‌ హీటర్‌ ఆన్‌ చేసిన మహిళకు కరెంట్‌ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెంలో చోటు చేసుకుంది. వర్షాకాలం కావడంతో ఇంట్లో విద్యుత్‌ సరఫరాలో సమస్యల కారణంగానే మహిళ విద్యుత్‌ ఘాతానికి గురైనట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మహళ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వర్షాకాలం కావడంతో రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వానలు పడుతున్నాయి. పలు చోట్ల రోడ్లన్నీ జలమయం కావడంతో రవాణా, విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వానలు పడే సమయాల్లో విద్యుత్ వాహకాలతో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us