Hyderabad Fire Accident: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భార్య సజీవదహనం కాగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో మృతిచెందిన సరస్వతి (45) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పోలీసులు గుర్తించారు. సరస్వతి నివాసం ఉంటున్న రెండో అంతస్తులో మంటలు చెలరేగినట్లు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.
అయితే.. ఇంట్లో ఎలా మంటలు చెలరేగాయోనన్న వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. చుట్టు పక్కల వారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అకస్మాత్తుగా మంటలు ఎలా చెలరేగాయన్న విషయం గురించి తెలుసుకుంటున్నారు.
Also Read: