5వ అంతస్తు నుంచి దూకేసిన మహిళ..! ఆత్మహత్యేనా..?

హైదరాబాద్‌లో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. అర్థరాత్రి 5వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. సరూర్‌ నగర్ పీఎస్‌ పరిధిలోని కొత్తపేట హుడా కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైశ్యా బ్యాంక్ అపార్ట్‌మెంట్లో నివసించే శ్రీలేఖ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికులను కలచివేసింది. అయితే, శ్రీలేఖ ఆత్మహత్యకు పాల్పడిందా..? ప్రమాదవశాత్తూ పడిపోయిందా..? లేదా ఎవరైనా బిల్డింగ్‌ పైనుంచి తోశారా..? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద […]

5వ అంతస్తు నుంచి దూకేసిన మహిళ..! ఆత్మహత్యేనా..?

Edited By:

Updated on: Jul 03, 2019 | 11:47 AM

హైదరాబాద్‌లో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. అర్థరాత్రి 5వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. సరూర్‌ నగర్ పీఎస్‌ పరిధిలోని కొత్తపేట హుడా కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైశ్యా బ్యాంక్ అపార్ట్‌మెంట్లో నివసించే శ్రీలేఖ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికులను కలచివేసింది.

అయితే, శ్రీలేఖ ఆత్మహత్యకు పాల్పడిందా..? ప్రమాదవశాత్తూ పడిపోయిందా..? లేదా ఎవరైనా బిల్డింగ్‌ పైనుంచి తోశారా..? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.