దారుణం.. చిన్న గొడవకే మహిళను కొట్టి చంపేశారు..

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మొరదాబాద్‌లో ఓ మహిళను పొరుగింటి వారే కొట్టి చంపేశారు. నగరంలోని జయంతిపుర్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

దారుణం.. చిన్న గొడవకే మహిళను కొట్టి చంపేశారు..

Edited By:

Updated on: Jun 03, 2020 | 9:23 PM

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మొరదాబాద్‌లో ఓ మహిళను పొరుగింటి వారే కొట్టి చంపేశారు. నగరంలోని జయంతిపుర్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వారితో చిన్న గొడవ చోటుచేసుకుంది. అయితే ఈ గొడవలో పిల్లలు కూడా తలదూర్చడంతో రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ సంఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం  స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.