Crime News: భార్యపై భర్త అమానుషం.. యువకుడితో మాట్లాడిందని.. నడి బజారులో దారుణంగా..

| Edited By: Ravi Kiran

Sep 14, 2021 | 7:29 AM

Woman beaten by Husband: దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ.. మహిళలపై ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఓచోట మహిళలపై జరిగే దారుణాలు వెలుగులోకి వస్తూనే

Crime News: భార్యపై భర్త అమానుషం.. యువకుడితో మాట్లాడిందని.. నడి బజారులో దారుణంగా..
Crime News
Follow us on

Woman beaten by Husband: దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ.. మహిళలపై ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఓచోట మహిళలపై జరిగే దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఓ యువకుడితో మాట్లాడిందని.. భార్యపై భర్త దారుణంగా ప్రవర్తించాడు. నడి వీధిలో భార్యను వివస్త్రను చేసి కొట్టాడు. అంతేకాకుండా ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను ఆమె భర్త, అత్త, పలువురు బహిరంగంగా కర్రలతో కొట్టారు. ఈఘటనలో ఆమె దుస్తులు చిరిగిపోయినప్పటికీ.. ఆమెను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. అయితే.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన అనంతరం.. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలిరాజ్‌పూర్ జిల్లాలోని సోండ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్లి గ్రామానికి వ్యక్తితో బాధితురాలికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో మహిళ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో తన సోదరి ఇంటికి వెళుతోంది. ఈ క్రమంలో దారిలో తెలిసిన ఓ యువకుడితో మాట్లాడింది. ఆమె మాట్లాడుతుండటాన్ని చూసిన భర్త ఇద్దరు సహచరులతో అక్కడికి చేరాడు. వచ్చిరాగానే భార్యను, యువకుడిని కొట్టడం ప్రారంభించాడు. అనంతరం భాధితురాలి అత్త కూడా అక్కడికి చేరుకుని.. కోడలినే దారుణంగా కొట్టింది. దుస్తులు చిరిగిపోయినప్పటికీ.. వివస్త్రను చేసి కొట్టారు. అయితే.. ఈ మొత్తం సంఘటనను అక్కడున్న ఓ యువకుడు తన కెమెరాలో బంధించి, తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

వీడియో వెలుగులోకి వచ్చిన పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. దీంతోపాటు వీడియోను అప్‌లోడ్ చేసిన యువకుడిపై కూడా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Viral Video: రూ.5 లేవన్నందుకు దారుణంగా కొట్టారు.. కస్టమర్‌పై హోటల్‌ యజమాని దాడి.. వీడియో

Crime News: పెళ్లై ఏడాది కాకముందే విల్లా కావాలంటూ భర్త వేధింపులు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య..