కర్ణాటకలోని మండ్య జిల్లా శ్రీరంగపట్టణం కేఆర్‌ఎస్ గ్రామంలో ఈనెల 6న సంచలనం రేకెత్తించిన హత్య(Murders) కేసులను పోలీసులు ఛేదించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురవడం స్థానికంగా కలకలం సృష్టించింది. మైసూరు తాలూకా బెలవెత్త గ్రామానికి చెందిన సునీల్ భార్య లక్ష్మిని నిందితురాలిగా గుర్తించి అరెస్టు చేశారు. గంగారామ్ భార్య లక్ష్మి, ఆమె ముగ్గురు పిల్లలు రాజ్, కోమల్, కునాల్, అన్న కుమారుడు గోవింద హత్యకు గురయ్యారు. నిందితురాలు లక్ష్మి, మృతురాలు లక్ష్మి ఇద్దరూ వరుసకు అక్కాచెల్లెళ్లు. గంగారామ్ పై ఉన్న ఇష్టంతో నిందితురాలు లక్ష్మి.. గంగారామ్ నుంచి అతని భార్యను దూరం చేసేందుకు ప్రయత్నించింది. వారి మధ్య గొడవలు సృష్టించేందుకు విఫలయత్నం చేసింది. లాభం లేకపోవడంతో గంగారామ్ భార్యను చంపేయాలని నిర్ణయించింది.
చికెన్ కొట్టేందుకు ఉపయోగించే కత్తితో గంగారామ్ ఇంటికి చేరుకుంది. అర్ధరాత్రి వరకు లక్ష్మితో గొడవ పడింది. తెల్లవారుజామున మూడు గంటలకు లక్ష్మిపై విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేసింది. అలికిడికి నిద్ర లేచిన పిల్లలనూ అదే కత్తితో అంతమొందించింది. మృతదేహాలపై బ్లాంకెట్ పరిచి ఇంట్లో బీరువాలో ఉన్న దుస్తులను చెల్లాచెదురుగా పడేసి దొంగతనం జరిగినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అనంతరం అక్కడి నుంచి పరారైంది. మరుసటి రోజు రోదిస్తూ అంత్యక్రియల్లో పాల్గొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లక్ష్మిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వాస్తవాలు వెల్లడయ్యాయని జిల్లా ఎస్పీ ఎన్.యతీశ్ మీడియా వివరించారు.
Also Read
Aa Ammayi Gurinchi Meeku Cheppali: సుధీర్ బాబు సినిమా నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న పాట
Digital Beggar: ధర్మం చేయండి బాబయ్య.. చిల్లర లేకపోతే ఇలా చేయండయ్య.. నెటిజన్ల ఫిదా