విషాహారం తిని 76మందికి అస్వస్థత

|

Jul 09, 2020 | 9:57 AM

విశాఖ జిల్లా ఏజెన్సీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. జి.మాడుగుల మండలం మగతపాలెం గ్రామంలో పశు మాంసం తిని గ్రామంలోని 76 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు.

విషాహారం తిని 76మందికి అస్వస్థత
Follow us on

విశాఖ జిల్లా ఏజెన్సీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. జి.మాడుగుల మండలం మగతపాలెం గ్రామంలో పశు మాంసం తిని గ్రామంలోని 76 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం తెల్లవారుజామున పాడేరులోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

విషాహారం తిన్న మరికొంతమందిని జి. మాడుగుల లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు, మహిళలు సైతం ఉన్నారు. బుధవారం సాయంత్రం గ్రామస్తులంతా పశుమాంసాన్ని పంచుకుని రాత్రి భోజనంతో తిన్నారు. భోజన౦ చేసిన కొ౦త సమయం తర్వాత మాంసం తిన్నవారిలో వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. దీంతో వారందరినీ హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.