విజయవాడ నగర శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వాంబే కాలనీలోని సీ బ్లాక్ లో నివాసముంటున్న వేముల రామకృష్ణ(34)గా గుర్తించారు. స్థానికులు సమాచారం మేరకు విజయవాడ గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి బ్యాచ్‌లో యువకుల మధ్య చెలరేగిన వివాదంతో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారు జామున రోడ్డు మీదికి వచ్చిన సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వివరాలను సేకరిస్తోంది. విజయవాడలో ముఠాల మధ్య పెరిగిన విభేదాలు కూడా ఈ హత్యకు కారణమైన ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.