చెన్నై మెరీనా బీచ్‌లో విషాదం.. విజయవాడకు చెందిన విద్యార్థులు గల్లంతు.. గాలిస్తున్న గజ ఈతగాళ్లు..

|

Feb 11, 2021 | 10:31 PM

చెన్నై మెరీనా బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యంకాగా మిగిలిన ఇద్దరు విద్యార్థుల..

చెన్నై మెరీనా బీచ్‌లో విషాదం.. విజయవాడకు చెందిన విద్యార్థులు గల్లంతు.. గాలిస్తున్న గజ ఈతగాళ్లు..
Follow us on

చెన్నై మెరీనా బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యంకాగా మిగిలిన ఇద్దరు విద్యార్థుల కోసం గజ ఈతగాళ్ల గాలింపు మొదలు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే…ఆవడి ఇంజినీరింగ్‌ కళాశాలలో అడ్మిషన్‌ కోసం ఐదుగురు విద్యార్థులు చెన్నై వెళ్లారు. కౌన్సిలింగ్‌ తర్వాత వీరంతా మెరీనా బీచ్‌ చూసేందుకు వెళ్లారు. ఆ ఐదుగురిలో సముద్రంలోకి దిగిన శివబాజీ, గోపీశాంత్‌, ఆకాశ్ సముద్రంలోకి దిగారు. భారీ అలలు ఒక్కసారిగా మీదపడటంతో సముద్రంలోకి కొట్టుకుపోయారు. వీరిలో శివబాజీ మృతదేహం లభ్యంకాగా.. మృతదేహాన్ని చెన్నై రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ  ఘటన, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

తల్లిదండ్రుల పేదరికం.. మోయలేని ఫీజుల భారం, స్కూల్ వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకున్న పదో తరగతి బాలిక