Vijayawada crime branch: బెజవాడలో చిన్నారుల నీలి చిత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ ఫకీరుగూడెనికి చెందిన ఇరవై 24 ఏళ్ల సోహైల్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ చైల్డ్ పోర్న్ వీడియోస్ అమ్ముతూ.. విజయవాడ పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే.. ఈ కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో చిన్నారుల నీలి చిత్రాలు విక్రయిస్తున్న మరో అయిదుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల విజయవాడ ఫకీరుగూడెంకు చెందిన సొహైల్ అహ్మద్ అరెస్ట్ తర్వాత.. విచారణను ముమ్మరం చేశారు. విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. చిన్నారుల నీలిచిత్రాలను కొనుగోలు చేసి, ఇతరులకు విక్రయిస్తున్న పులువురిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు దృష్టిపెట్టారు.
సోషల్ మీడియాలో చిన్నారుల నీలిచిత్రాలను అప్లోడ్ చేస్తున్న మరో ఐదుగురిపై సీఐడీ ఏడీజీ ఆదేశాల మేరకు విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదుచేశారు. జీ మెయిల్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తున్నట్టు గుర్తించారు. స్పష్టమైన సమాచారం రావటంతో పోలీసులు నిఘా వేశారు. ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు విజయవాడ పోలీసులు తెలిపారు.
విజయవాడ ఫకీరు గూడెనికి చెందిన సోహైల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. పలు కంపెనీలలో పనిచేశాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఉంటున్న సోహైల్ చైల్డ్ పోర్న్ వీడియోస్ విక్రయించి.. అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఫిర్యాదుతో అతనిపై సెక్షన్ 62బి ఐ టి యాక్ట్, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు సోహైల్‌ను అరెస్ట్ చేశారు. అయితే సోహైల్ చిన్న పిల్లల నీలి చిత్రాలను ఎవరి వద్ద కొనుగోలు చేశాడు, ఎవరెవరికి అమ్మాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: