Village Boycott: నిజామాబాద్ జిల్లాలో మరో అరాచకం.. కొనసాగుతున్న వీడీసీల ఆగడాలు.. జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్న బాధితులు

|

Sep 22, 2021 | 1:42 PM

విలేజ్‌ విలన్ల పద్ధతి మారలేదు. అదే అరాచకం. అవే ఆటవిక తీర్పులు. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి..క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించినా వీడీసీ వెనక్కి తగ్గడంలేదు.

Village Boycott: నిజామాబాద్ జిల్లాలో మరో అరాచకం.. కొనసాగుతున్న వీడీసీల ఆగడాలు.. జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్న బాధితులు
Village Boycott
Follow us on

Village Boycot: విలేజ్‌ విలన్ల పద్ధతి మారలేదు. అదే అరాచకం. అవే ఆటవిక తీర్పులు. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి..క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించినా విలేజ్‌ డెవలప్‌మెంట్ కమిటీలు(వీడీసీ) వెనక్కి తగ్గడంలేదు. నిజామాబాద్ జిల్లాలో మరో అరాచకానికి తెరలేపాయి.. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామంలో వడ్డెర కులస్తులను బహిష్కరించారు. స్థల వివాదంలో జోక్యం చేసుకున్న VDC ఏకంగా 150 వడ్డెర కుటుంబాలను బాయ్‌కాట్ చేసింది. దీంతో తమకు జరిగిన అన్యాయం గురించి జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు బాధితులు.

విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ అధికారంతో మరో గ్రామంలో చిచ్చు రేగింది. ఇరు వర్గాల మధ్య సమస్యను పరిష్కరించాలన కమిటి పెద్దలు ఒక వర్గానికి కొమ్ము కాస్తుండడంతో వివాదం ముదురుతోంది. వీడీసీల అరాచకాలపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. స్పందించిన అధికారయంత్రాంగం అనేక మందిపై క్రిమినల్ కేసులు పెట్టింది. పలు కమిటీలను రద్దు చేసింది. అయినా మళ్లీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి.. రాష్ట్రంలో గత కొద్దిరోజుల క్రితం ఎర్పడిన గ్రామ అభివృద్ది కమిటిలు కొన్ని గ్రామాల్లో తమ అధికారంతో కొన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాము చెప్పిందే వేదంగా గ్రామంలో రాజకీయ కక్ష్యలతో పాటు సామాజిక విభేదాలను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు గ్రామ అభివృద్ది కమిటీ తీరు వివాదస్పదం అవుతోంది. వారు చెప్పిందే వేదంగా ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే నిజామాబాద్ రూరల్ జిల్లాలోని ఆర్మూర్, వేల్పూర్, ఇతర గ్రామాల్లోని పలు కమిటిల ఆగడాలు గతంలో తీవ్ర కలకలం సృష్టించాయి. తాజాగా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి వ్యవహారంతో కొత్త చర్చకు దారి తీసింది. గ్రామంలో సుమారు 150 కుటుంబాలను ఓ వివాదంలో బహిష్కరించారు. వారికి వివిధ పనుల్లో సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వడ్డెర కుటుంబాలకు చెందిన గ్రామస్థుడు చనిపోతే… అత్యక్రియలకు కావాల్సిన వస్తువులు ఇచ్చేందుకు ఆ గ్రామస్థులు నిరాకరించారు. తమ తో మాట్లాడితే 10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు కూడా పిర్యాదు చేసేవరకు వెళ్లింది.

Read Also… Tedros Adhanom: భారత్‌ నిర్ణయం పేద‌, మ‌ధ్య ఆదాయ దేశాల‌కు ఊరట.. కృతజ్ఞతలు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ