Uttar Pradesh: భార్య శవంతో నాలుగు రోజులు ఇంట్లోనే.. బండారం బయటపడింది ఇలా..!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లో కట్టుకున్న భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్సోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో జరిగిన ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు బయటపడ్డాయి. మద్యం షాపులో పనిచేస్తున్న భరత్ అనే ఉద్యోగి తన 51 ఏళ్ల భార్య సునీతను గొంతు కోసి హత్య చేశాడు. కానీ అతను మృతదేహాన్ని ఎక్కడా పారేయకుండా ఇంట్లోనే దాచిపెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా మామూలుగా […]

Uttar Pradesh: భార్య శవంతో నాలుగు రోజులు ఇంట్లోనే.. బండారం బయటపడింది ఇలా..!
Crime

Updated on: Mar 03, 2024 | 1:05 PM

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లో కట్టుకున్న భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్సోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో జరిగిన ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు బయటపడ్డాయి. మద్యం షాపులో పనిచేస్తున్న భరత్ అనే ఉద్యోగి తన 51 ఏళ్ల భార్య సునీతను గొంతు కోసి హత్య చేశాడు. కానీ అతను మృతదేహాన్ని ఎక్కడా పారేయకుండా ఇంట్లోనే దాచిపెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా మామూలుగా పనిమీద రోజూ షాపుకి వెళ్ళాడు. అయితే మూడు రోజులుగా ఇంట్లోనే ఉంచిన మృతదేహం కుళ్లిపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు యవ్వారం బయటపడింది.

ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన వస్తోంది. ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలో నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు భర్త భరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా తన భార్యను గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించాడు. సునీతతో రెండో పెళ్లి చేసుకున్నట్లు భరత్ చెప్పాడు. సునీతకు కూడా ఇది రెండో పెళ్లి అని పోలీసులు తెలిపారు.

ఇద్దరికీ మొదటి వివాహం జరిగిపిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరికీ సొంత పిల్లలు లేరు. దంపతులు గత రెండేళ్లుగా అంబేద్కర్ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం.. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. డబ్బు కోసం ఇద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడేవారు. భరత్ మద్యం షాపులో పనిచేసేవాడు. మద్యానికి బానిసయ్యాడు. అటు సునీతకు సొంత దుకాణం ఉంది. మూడు రోజుల క్రితం డబ్బు విషయమై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో భరత్ ఆవేశంతో సునీత గొంతు కోసి హత్య చేశాడు.

అయితే ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు, ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. మూడు రోజుల తర్వాత అతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు డయల్‌-112కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, అక్కడ ఇంట్లో సునీత మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు భరత్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Loading...
Unable to load recommendations.
Follow Us