Gang-rape Victim Dies: 54 ఏళ్ల మహిళపై సామూహిక లైంగిక దాడి.. పట్టించుకోని పోలీసులు.. చివరికి ఏం చేసిందంటే..?

|

Oct 09, 2021 | 9:20 PM

తనకు జరిగిన దారుణంపై గోడు వెళ్లబుచ్చుకున్న పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన అత్యాచార బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌ ముందే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.

Gang-rape Victim Dies: 54 ఏళ్ల మహిళపై సామూహిక లైంగిక దాడి.. పట్టించుకోని పోలీసులు.. చివరికి ఏం చేసిందంటే..?
Gang Rape
Follow us on

Gang-rape Victim Suicide: మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే దరిచేరనివ్వలేదు.. తనకు జరిగిన దారుణంపై గోడు వెళ్లబుచ్చుకున్న పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన అత్యాచార బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌ ముందే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో కదలిన జిల్లా యంత్రాంగం.. సదరు పోలీసు అధికారిని విధుల నుంచి తప్పించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

ఉత్తరప్రదేశ్‌ మెహంజ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 54 ఏళ్ల మహిళపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ నెల 5న సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు అత్యవసర పోలీస్‌ నంబర్‌కు ఫోన్‌ చేసింది. ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్న పోలీసులు పట్టించుకోలేదు. దీంతో నేరుగా తన భర్తతో కలిసి అజామ్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. లైంగికదాడికి పాల్పడిన అనిల్‌ సింగ్‌తోపాటు మరో వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. అయితే, నిందితులను వదిలేసిన పోలీసులు.. తమను నాలుగు గంటల పాటు పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోపెట్టారని, రాజీ కోసం ప్రయత్నించారని ఆ మహిళ భర్త ఆరోపించాడు.

మరోవైపు బాధిత మహిళ నాలుగు రోజులపాటు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. పోలీసులు ఫిర్యాదు నమోదు చేయకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే శనివారం అజామ్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద వెంట తెచ్చుకున్న విషం సేవించింది. ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో తేరుకున్న పోలీసులు కుటుంబసభ్యుల సహాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మహిళ ప్రాణాలు విడిచింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే మహిళ మరణించిందని స్థానికులు ఆరోపించారు. బాధితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై తీవ్ర స్పందించిన జిల్లా ఎస్పీ సుధీర్‌ కుమార్‌ సింగ్‌ ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఐ చున్నా సింగ్‌ను సస్పెండ్‌ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతోపాటు నిందితులను అరెస్ట్‌ చేసేందుకు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మరోవైపు అత్యాచార బాధిత మహిళ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్‌ ట్విట్టర్‌లో స్పందించారు. సాధారణ ప్రజలకు న్యాయం చేస్తున్నామంటున్న బీజేపీ ప్రభుత్వానికి ఈ ఘటన చెంపదెబ్బని విమర్శించారు. నిందితులతోపాటు నిర్లక్ష్యం వహించిన పోలీస్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


Read Also… Hyderabad: ఛీ ఛీ.. మరీ ఇంత కక్కుర్తా.. చెప్పుల దొంగతనం.. షాప్ పెట్టుకుంటాడు కాబోలు