Farmers Died: మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. పొలంలో.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువ రైతులు మృతి..

|

Jul 10, 2021 | 11:55 AM

Two young farmers die of electric shock: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు యువ రైతులు

Farmers Died: మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. పొలంలో.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువ రైతులు మృతి..
Young Farmers Die
Follow us on

Two young farmers die of electric shock: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు యువ రైతులు మరణించారు. ఈ సంఘటన తొర్రూరు మండలంలోని భోజ్య తండాలో జరిగింది. ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో.. భోజ్య తండాకు చెందిన భూక్య సుధాకర్‌, మాలోతు యాకూబ్‌ శనివారం ఉదయం పనుల కోసం తమ పొలం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పోలంలోని బోరు స్టార్టర్‌కు ఉన్న ఫీజులు పోవడంతో వాటిని వేసేందుకు సుధాకర్, యాకూబ్ ప్రయత్నించారు.

ఈ క్రమంలో బోరుకు తాకి ఉన్న వైరుకు విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో ఇద్దరు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎప్పుడూ సరదాగా ఉండే కుటుంబంలోని ఇద్దరు యువకులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమన్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Vizianagaram: విజయనగరం జిల్లాలో దారుణం.. ఇద్దరు చిన్నారులను నేలకేసి కొట్టిన కసాయి తండ్రి..

Video Games: వీడియో గేమ్స్‌కి బానిసైన బాలుడు.. ఏకంగా తన తల్లికే ఊహించని షాకిచ్చాడు..

Black Magic: పెద్దాపురంలో క్షుద్రపూజలు కలకలం.. ఇంటి అవరణలో నిమ్మకాయలు, పూజాసామగ్రి..!