సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాపైన రెండేళ్ళ చిన్నారి సేఫ్‌గా తల్లిదండ్రుల వద్దకు చేరింది. బాలిక తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పాపను ఎత్తుకెళ్తున్న నిందితున్ని వీడియోలో గుర్తించారు. నిందితుని కోసం గాలించగా స్టేషన్ బయట చిన్నారి కనిపించింది. నిందితుడు మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. పాప ను చిల్డ్రన్ హోంకు తరలించారు. నిందితుడి ఫుటెజ్ ను విడుదల చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
నెల్లూరు జిల్లా కావలి మండలం రామన్నగరిపల్లి గ్రామానికి చెందిన డి. సురేశ్, తన కుమారుడు ప్రభాస్, కూతురు రెండు సంవత్సరాల వయస్సున స్వర్ణలతతో కలిసి ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చాడు. నెల్లూరుకు వెళ్లాల్సిన సురేశ్ ఆ రోజు రాత్రి అక్కడే తన పిల్లలతో కలిసి నిద్రించాడు. అయితే సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో నిద్ర లేచి చూసేసరికి తన కూతురు కనిపించలేదు. స్టేషన్ మొత్తం వెతికినా స్వర్ణలత ఆచూకీ లభించలేదు. దీంతో రైల్వే పోలీసులకు సురేశ్ ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి..పాపను కనుగొన్నారు.