Real Estate Murders in Hyderabad: రెండు హత్యలు.. అంతులేని అనుమానాలు.. మంగళవారం హైదరాబాద్ ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్యలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిద్దరినీ హత్య చేసింది ఎవరు? మట్టారెడ్డి పనేనా ? లేక సుపారీ గ్యాంగ్ ఈ హత్యలు చేశారా ? అసలు వీరిద్దరినీ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.. అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మట్టారెడ్డి అనే వ్యక్తిపైనే అందరి అనుమానాలున్నాయి. అయితే కాల్పులు జరిగిన సమయంలో మట్టారెడ్డి సైట్ దగ్గరున్నాడు. దీంతో అసలు కాల్పులు జరిపింది ఎవరనేది అంతుచిక్కడం లేదు. సుపారీ గ్యాంగ్ ఈ హత్యలు చేశారా ? లేక మాజీ నక్సల్స్ చేశారా ? అనే అనుమానాలున్నాయి. అటు నయీం మనుషులపై కూడా డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్యల వెనుక ట్విస్టులు అంతుచిక్కడం లేదు. ఈ హత్యలో నిందితులు వాడిన బుల్లెట్స్ 9MM పిస్టోల్ బుల్లెట్స్. ఇవి పోలీసులు లేదా మాజీ నక్సల్స్ లేదా నయాం మనుషులు మాత్రమే ఉపయోగిస్తారు. దీంతో ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. మర్డర్‌కు ఉపయోగింది పోలీసుల బుల్లెట్ల, మాజీ నక్సల్స్‌కి సంబంధించినవా ? లేక మట్టారెడ్డి సుపారీ గ్యాంగ్‌కి చెందినవా ? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ రెండు హత్యలకు రెండు వెపన్స్ ఉపయోగించారని తెలుస్తోంది. శ్రీనివాస్‌రెడ్డిని షార్ట్ వెపన్‌తో, రాఘవేందర్‌రెడ్డిని పిస్టల్‌తో కాల్చి చంపారు. దీంతో ఈ హత్యలకు ఉపయోగించిన రెండు వేర్వేరు బుల్లెట్లను స్వాధీన్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రీనివాస్‌రెడ్డి డ్రైవర్‌తో పాటు మట్టారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్ ఓ బిల్డర్. రెండు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో రఘుతో కలిసి పదెకరాల ల్యాండ్ కొన్నాడు. కానీ అప్పటికే ఆ భూమి నాదంటూ కబ్జా చేశాడు మట్టారెడ్డి. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్, మరో వ్యక్తితో కలిసి సైట్ దగ్గరికి వెళ్లగా, అక్కడే మట్టారెడ్డితో వాగ్వాదం జరిగింది. అక్కడినుంచి వెళ్లిన కాసేపటికే కారులో కాల్పులు జరిగాయి. దీంతో మట్టారెడ్డిపైనే అనుమానాలున్నాయి. ఆయనే సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్యలు చేయించాడనే డౌట్స్ ప్రధానంగా వినిపిస్తున్నాయి.
కాల్పులు జరిగిన సమయంలో మట్టారెడ్డి సైట్ దగ్గరే ఉన్నాడు. కానీ కారులో కాల్పులు జరిగాయి. శ్రీనివాస్ రెడ్డి స్పాట్‌లోనే చనిపోయాడు.. కానీ, రఘు గాయాలతో చాలాసేపు కార్లోనే చావుతో పోరాడాడు. అతణ్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇంతకీ కాల్పులు జరిపిందెవరు? కాల్పులు జరిపాక ఎక్కడికి వెళ్లాడన్నది మిస్టరీగా మారింది. అయితే, మృతుల కుటుంబసభ్యులు మాత్రం.. మట్టారెడ్డిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో అందరూ నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి మట్టా రెడ్డి మాత్రం తనకేం తెలియదని చెబుతున్నాడు. కలిసి పనిచేశామే తప్ప.. వారితో తనకు ఎలాంటి గొడవలూ లేవని చెబుతున్నాడు. వారికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయో తనకు తెలియదంటున్నాడు.
Also Read: