Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. విద్యుత్‌ కంచెలు తగిలి ఇద్దరి మృత్యువాత..

|

Dec 07, 2021 | 11:10 AM

అటవీ జంతువుల కోసం అమర్చిన విద్యుత్‌ కంచెలు మనుషుల పాలిట మృత్యుపాశాలుగా మారిపోతున్నాయి

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. విద్యుత్‌ కంచెలు తగిలి ఇద్దరి మృత్యువాత..
Follow us on

అటవీ జంతువుల కోసం అమర్చిన విద్యుత్‌ కంచెలు మనుషుల పాలిట మృత్యుపాశాలుగా మారిపోతున్నాయి. ప్రమాదవశాత్తూ వాటి బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పొలాలకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా అటవీ జంతువుల కోసం ఏర్పాటు చేసిన కరెంటు తీగల ఉచ్చులో పడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో రంగువారిగూడెం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతులను డేనియల్‌, బాలుగా గుర్తించారు. సోమవారం రాత్రి పొలం పనులకు వెళ్లిన వీరికి ప్రమాదవశాత్తూ కరెంట్‌ తీగలు తగిలాయి. విద్యుదాఘాతంతో సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులను అడిగి మృతుల వివరాలు తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇటీవల ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. దీంతో పొలాలకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా . వాంకిడి మండలంలోని టోక్కి గూడలో విద్యుత్‌ కంచెలు తగిలి ఒక మహిళ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యత్‌ కంచెలు అమరుస్తోన్న వేటగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

Also Read:

Hyderabad: తాగుబోతుల అడ్డాగా మారుతున్న భాగ్యనగరం.. సర్వే రిపోర్ట్‌లో షాకింగ్ అంశాలు

Students Missing: సినిమాకు వెళ్లారని టీచర్ల మందలింపు.. నలుగు విద్యార్థుల అదృశ్యం.. తల్లిదండ్రుల ఆందోళన..

Vijayawada: విజయవాడపై నీలి చిత్రాల నీడలు.. వెలుగులోకి కీలక విషయాలు.. మరో ఐదుగురిపై కేసు