Huzurnagar Lovers Suicide: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలక ప్రియుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు రోజుల వ్యవధిలో ప్రేమికులిద్దరు ప్రాణాలొదలడంతో సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డకు చెందిన పవన్, మౌనిక ఇద్దరు బావ మరదలు. దగ్గరి కుటుంబసభ్యులుగా కావడంతో.. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, మౌనిక.. గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రియురాలి మరణం తట్టుకోలేక పవన్ కూడా శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ప్రాణాలు వదిలాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మౌనిక, పవన్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, ఇదే క్రమంలో గురువారం అనుహ్యంగా మౌనిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు మరణం తట్టుకోలేక మనస్తాపానికి గురైన ప్రియుడు పవన్ కూడా శుక్రవారం పురుగుల మందు సేవించాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటీన సూర్యాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పవన్ శనివారం ప్రాణాలు విడిచాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో ప్రేమికుల జంట ఆత్మహత్య జరగడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, పురుగుల మందు సేవిస్తూ ప్రియుడు పవన్ తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలావుంటే, త్వరలో ఇద్దరికి వివాహం జరిపించేందుకు ఇరువురి కుటుంబాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.