Friends Commit Suicide: హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలోనే ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ముషీరాబాద్ బాకారంలో నివాసం ఉండే ప్రవీణ్, శ్రీకాంత్ అనే యువకులు మంగళవారం తమ తమ ఇళ్లల్లో ఆత్మహత్య చేసుకున్నారు. మొదట శ్రీకాంత్ చారి ఆత్మహత్య చేసుకోగా.. కొద్ది గంటల్లో వ్యవధిలోని ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు స్నేహితులు గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఎప్పుడు సరదాగా.. ఉండే శ్రీకాంత్, ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికులు అందించిన సమాచారం మేరకు ముషీరాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురి నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఐపిసి సెక్షన్ 174 అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.
Also Read: