కాణిపాకం వెళ్తుండగా ఘోర ప్రమాదం.. బస్సు ఢీకొని ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం..

|

Mar 07, 2021 | 6:52 PM

Road Accident: ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఇద్దరు విద్యార్థుల జీవితాలను చిదిమేసింది. బస్సు బైక్‌ను ఢికొన్న ఘటనలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు కాణిపాకం..

కాణిపాకం వెళ్తుండగా ఘోర ప్రమాదం.. బస్సు ఢీకొని ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం..
Road Accident
Follow us on

Road Accident: ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఇద్దరు విద్యార్థుల జీవితాలను చిదిమేసింది. బస్సు బైక్‌ను ఢికొన్న ఘటనలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు కాణిపాకం వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. రాజమహేంద్రవరానికి చెందిన అభిరామ్‌, నెల్లూరు వాసి అలేఖ్య తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. ఆదివారం కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై తిరుపతి నుంచి కాణిపాకం వెళుతున్నారు. చంద్రగిరి మండలం.. ఐతేపల్లి వద్దకు చేరుకోగానే చిత్తూరు నుంచి తిరుపతి వస్తున్న ఆర్టీసీ బస్సు అభిరామ్‌, అలేఖ్య వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అభిరామ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన అలేఖ్యను తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Petrol Price: మంచిర్యాల జిల్లాలో దారుణం.. 50 రూపాయల పెట్రోల్ కోసం ఓ వ్యక్తిని చావబాదారు..

Jangareddygudem Accident: గుబ్బల మంగమ్మను దర్శించేందుకు ట్రాక్టర్‌లో బయలుదేరారు.. మధ్యలో టీ తాగేందుకు ఆగారు.. ఇంతలో