Atrocities: ప్రకాశం జిల్లాలో ఒకే రోజు రెండు దారుణాలు, సభ్యసమాజం తలదించుకునే ఉదంతాలు

ప్రకాశం జిల్లాలో ఒకే రోజు రెండు దారుణాలు వెలుగు చూశాయి. చీరాల, చిన్నగంజాం ప్రాంతాల్లో సభ్య సమాజం తలదించుకునే దారుణాలు..

Atrocities: ప్రకాశం జిల్లాలో ఒకే రోజు రెండు దారుణాలు, సభ్యసమాజం తలదించుకునే ఉదంతాలు
Atrocities

Updated on: Jul 13, 2021 | 2:00 PM

Prakasam District: ప్రకాశం జిల్లాలో ఒకే రోజు రెండు దారుణాలు వెలుగు చూశాయి. చీరాల, చిన్నగంజాం ప్రాంతాల్లో సభ్య సమాజం తలదించుకునే దారుణాలు చోటు చేసుకున్నాయి. పర్చూరు శివారు పొలాల్లో 60 ఏళ్ళ వృద్దురాలిపై ఆటోవాలాలు అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, చిన్నగంజాంలో మైనర్ బాలిక పై  యువకుడి అత్యాచారం జిల్లా వ్యాప్తంగా కలవరం రేపుతోంది.

రెండు అకృత్యాల వివరాల్లోకి వెళితే, పర్చూరు మండలం అడుసుమల్లిలో ఆటో ఎక్కింది చీరాలకు చెందిన ఒక వృద్దురాలు. అయితే, ఆమెను గమ్యస్థానానికి చేర్చకుండా ఆటో డ్రైవర్.. మరికొందరు ఆటో డ్రైవర్లతో కలిసి శివారు పొలాల్లోకి తీసుకెళ్లి వృద్దురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. కీచకుల నుంచి ఎలాగోలా బయటపడ్డ వృద్ధురాలు, తనపై జరిగిన అఘాయిత్యం గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో దారుణం బయటకొచ్చింది.

వృద్ధురాలు ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇలా ఉండగా, ప్రకాశం చిన్నగంజాంలో మైనర్ బాలిక (14) పై 20 ఏళ్ళ యువకుడు అత్యాచారం చేశాడు. ఫిర్యాదు మేరకు బాధితురాల్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు.. నిందితుడిపై పొక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Read also: Polavaram Project: పోలవరం సాకారం దిశగా ‘మేఘా’ వేగంతో పనులు

Loading...
Unable to load recommendations.
Follow Us