రూ. 1.13 కోట్ల విలువైన మందుల స్మగ్లింగ్. ఇద్దరు ఆఫ్ఘన్ల అరెస్ట్
ఆఫ్ఘన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రూ. 1.13 కోట్ల విలువైన మందులు, ఔషధాలను దొంగరవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరు కాబూల్ వెళ్లే విమానం ఎక్కబోతుండగా..
ఆఫ్ఘన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రూ. 1.13 కోట్ల విలువైన మందులు, ఔషధాలను దొంగరవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరు కాబూల్ వెళ్లే విమానం ఎక్కబోతుండగా కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వివిధ మందులతో కూడిన 8 బ్యాగులను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గతంలో తాము రూ. 19 లక్షల విలువైన బట్టలను స్మగుల్ చేసినట్టు వీరు అంగీకరించారట. ఈ మందుల దొంగరవాణాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.