
పంజాగుట్ట పీఎస్ ఎదుట ఆత్మాహత్యాయత్నం చేసుకొని చికిత్స తీసుకుంటూ మరణించిన లోకేశ్వరి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 27న ప్రవీణ్ కుమార్‌పై పంజాగుట్ట పీఎస్‌లో లోకేశ్వరి ఫిర్యాదు చేసింది. దీంతో పంజాగుట్ట ఎస్‌ఐ ప్రవీణ్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో విచారణ చేసిన తరువాత కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. అయితే దీనితో సంతృప్తి చెందని లోకేశ్వరి.. ఈ విషయంలో ఏసీపీకి ఫిర్యాదు చేసేందుకు మంగళవారం మరోసారి పంజాగుట్టకు వచ్చింది. ఈ క్రమంలో అరగంట పాటు ప్రవీణ్‌తో లోకేశ్వరి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నన్ను పోలీసులు ఏం చేయలేరని ప్రవీణ్ రెచ్చగొట్టినట్లు సమాచారం. దీంతో ఆవేశంతో లోకేశ్వరి నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించారు.