West Bengal: రెచ్చిపోయిన తృణమూల్ కార్యకర్తలు.. ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పు.. ఎందుకంటే..?

|

Mar 22, 2022 | 1:03 PM

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా రాంపూర్‌హట్ ప్రాంతంలోని బర్షాల్ గ్రామ పంచాయతీ అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు.

West Bengal: రెచ్చిపోయిన తృణమూల్ కార్యకర్తలు.. ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పు.. ఎందుకంటే..?
Follow us on

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా రాంపూర్‌హట్ ప్రాంతంలోని బర్షాల్ గ్రామ పంచాయతీ అధికార తృణమూల్ కాంగ్రెస్(TMC) కార్యకర్తలు రెచ్చిపోయారు. గ్రామంలో పార్టీకి చెందిన నేత బదు షేక్ అనే నేత నిన్న బాంబు దాడిలో(Bomb Attack) మరణించటం తీవ్ర పరిణామాలకు కారణమైంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ పార్టీ నేతలు దాడులకు దిగారు. గ్రామంలో ప్రత్యర్థులకు సంబంధించిన 5 ఇళ్లకు నిప్పంటించారు. ప్రత్యర్థులను వారి ఇళ్లలోపల నిర్బందించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, జిల్లా మెజిస్ట్రేట్ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.

పొలిటికల్ మర్డర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు తృణమూల్ నేతలు చేసిన మారణకాండ అనేక మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు చెప్పారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. గ్రామంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చి.. ఉద్రిక్తతలను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అదనపు బలగాలను రంగంలోకి దించారు.

ఇవీ చదవండి..

Market News: భారత మార్కెట్లు చతికిల పడ్డాయా..? వారం ప్రారంభం నుంచి మళ్లీ నష్టాల్లోకి..

Stock Market: స్టాక్స్ కొనేటప్పుడు ఇన్వెస్టర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాలి.. పూర్తి వివరాలు..

Penny Stock: ఏడాదిలో 2330% పైగా పెరిగిన పెన్నీ స్టాక్.. ఇన్వెస్టర్ల విలువను ఎంత పెంచిందంటే..