Petrol Attack: అటవీశాఖ సిబ్బందిపై తిరగబడ్డ పోడు రైతులు.. మహిళా రేంజ్ అధికారిణిపై పెట్రోల్ దాడి..!

|

Sep 16, 2021 | 6:47 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అటవీ శాఖ అధికారిణిపై పెట్రోల్ దాడికి యత్నించారు ఆదివాసీలు. మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులపై గిరిజనులు పెట్రోల్‌తో దాడి చేశారు.

Petrol Attack: అటవీశాఖ సిబ్బందిపై తిరగబడ్డ పోడు రైతులు.. మహిళా రేంజ్ అధికారిణిపై పెట్రోల్ దాడి..!
Tribal Farmers Petrol Attack
Follow us on

Tribal Farmers Petrol Attack: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అటవీ శాఖ అధికారిణిపై పెట్రోల్ దాడికి యత్నించారు ఆదివాసీలు. మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులపై గిరిజనులు పెట్రోల్‌తో దాడి చేశారు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్ పరిదిలోని పందిపంపుల గ్రామ శివారులో ఈ ఘటనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోడుభూమిలో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటుతుండగా.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆదివాసీలు అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీ రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ నెలకొంది.

ఈ క్రమంలోనే ఆదివాసీ రైతులు అటవీ అధికారిణిపై సెట్రోల్ పోసి నిప్పటించేందుకు ప్రయత్నించారు. పోడు భూముల్లో ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ భాదితురాలిని భూపాలపల్లి PHCకి తరలించారు అధికారులు. కాగా, ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Read Also..  TSRTC Bus: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం.. ఇకపై బస్సుల్లో అలాంటి పోస్టర్లపై నిషేధం

Cat Viral Video: ‘కాపీ క్యాట్’ అన్న పదానికి ఈ పిల్లి సరిగ్గా సరిపోతుంది.. మార్జాలం చేసిన పని చూస్తే..