Hyderabad Traffic Challans: యాక్టివా స్కూటర్‌ను ఆపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. చలాన్ల లిస్ట్ చూసి షాక్..!

|

Aug 31, 2021 | 8:29 AM

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రూల్స్‌ను పోలీసులు కఠినతరం చేశారు. నిబంధనలు పాటించకుంటే వాహనదారులకు ఎక్కడికక్కడ చలాన్లు వేస్తున్నారు.

Hyderabad Traffic Challans: యాక్టివా స్కూటర్‌ను ఆపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. చలాన్ల లిస్ట్ చూసి షాక్..!
Traffic Challan
Follow us on

Hyderabad Traffic police fine: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రూల్స్‌ను పోలీసులు కఠినతరం చేశారు. నిబంధనలు పాటించకుంటే వాహనదారులకు ఎక్కడికక్కడ చలాన్లు వేస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది రూల్స్‌ను బ్రేక్ చేస్తూనే ఉన్నారు. కొందరు హెల్మెట్ ధరించకపోతే.. మరికొందరు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంకొందరు రాంగ్ సైడ్, సిగ్నల్ జంపింగ్ లాంటివి చేస్తున్నారు. దీంతో వారందరికీ పోలీసులు చలాన్లు వేసి జరిమానా విధిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఈ చలాన్లు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారు. హ్యాపీగా బండిపై తిరిగేస్తున్నారు. అయితే, ఇకపై అలాంటి కుదరవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదే క్రమంలో నిబంధనలను అతిక్రమించి తిరుగుతున్న ఓ టూ వీలర్‌ను ఆపి తనిఖీ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఆ వెహికల్ పెద్ద సంఖ్యలో ఉల్లంఘనల చలానాలు, జరిమానా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం తెలుగు తల్లి కూడలిలో వాహన తనిఖీలు చేస్తున్న సైఫాబాద్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ మోహన్‌, ఆ మార్గంలో హెల్మెట్‌ లేకుండా, నంబరు ప్లేట్‌ సరిగా లేకుండా వెళుతున్న యాక్టివా(టీఎస్‌08 ఎఫ్‌యూ0846)ను ఆపారు. తనిఖీ చేయగా మొత్తం 81 చాలానాలు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించి రూ.21,800 జరిమానా ఉన్నట్లు తేలింది. సదరు వాహనాన్ని బాలానగర్‌కు చెందిన వినోద్‌యాదవ్‌ నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో మరోసారి జరిమానా రాయడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇక నుంచి ఏ చిన్న ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసినా… ప్రతీ వాహనదారుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. చలానాల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం అస్సలు తగదని పోలీస్ నిబంధనలు చెబుతున్నాయి. బండిపై పడిన చలానాలు వెంటనే కట్టేయాల్సిందే అంటున్నారు. లేదంటే ఒక్క చలానా పెండింగ్ లో ఉన్నా నిబంధనల ప్రకారం వాహనాన్ని సీజ్ చేస్తామని హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. కాగా, మీ వాహనం సీజ్ కాకూడదంటూ.. పెండింగ్‌లో ఉన్న చలాన్లు అన్ని క్లియర్ చేస్తేనే బెటర్.

Read Also…  Harassment: హైదరాబాద్‌లో దారుణం… తల్లితో సహజీవనం చేస్తూ.. కూతురిపై కన్నేసిన ప్రబుద్ధుడు.