
అసలు రోజురోజుకూ సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. డబ్బు, మోహం పిచ్చిలో పడి జనాలు రక్తసంబంధాలనే మర్చిపోతున్నారు. వావీ వరసలు లేకుండా అక్రమసంబంధాలు పెట్టుకొని అడ్డొచ్చిన వారిని కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. అల్లుడిని పెళ్లాడేందుకు ఒక మహిళ ఏకంగా కన్న కూతుర్నే కడతేర్చాలనుకుంది. ఆమెపై రోకలిబండతో దాడి చేసింది. గమనించిన స్థానికులు కూతురిని హాస్పిటల్‌కు తరలించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలుడు, బాలిక (15) ఐదు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. బాధితురాలి తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి తమతోనే కలిసి ఉంటుంది. అయితే భర్త చనిపోవడంతో 40 ఏళ్ల వయస్సున్న అత్త, 18 ఏళ్ల అల్లుడితో చనువుగా ఉండడం స్టార్ట్ చేసింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఒక రోజూ కూతురు ఇంట్లో ఉండగానే ఇద్దరూ పెళ్లిచేసుకోవడానికి సిద్దమయ్యారు. అది గమనించిన కూతురు భర్త తల్లి మెడలో తాళి కట్టబోతుంటే అడ్డుకుంది. అతనితో వాగ్వాదానికి దిగింది. దీంతో రెచ్చిపోయిన బాలిక తల్లి, భర్త ఇద్దరూ కలిసి బాలికపై రోకలి బండతో దాడికి పాల్పడ్డారు. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది.
ఇంట్లో నుంచి అరుపులు,కేకలు వినిపించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్థానకులు, తీవ్రగాయాలతో పడిన ఉన్న బాలికను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అత్తా, అల్లుడిని చితకబాధి పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.