కడచూపుకు రండి.. నిర్భయ దోషుల పేరెంట్స్‌కు సమాచారం..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార నిందితులకు ఫిబ్రవరి 1వ తేదీన ఉరిశిక్ష అమలుకానుంది. ఢిల్లీలోని పాటియాల కోర్ట్.. ఆదేశాల ప్రకారం.. ఉదయం ఆరుగంటలలోపు ఉరితీసేందుకు.. తీహార్‌జైలు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నలుగురు దోషులు వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌(31), ముఖేష్‌ కుమార్‌ (32), పవన్‌(26)లను ఒకేసారి ఉరితీయనున్నారు. ఈ నేపథ్యంలో దోషుల కుటుంబ సభ్యులకు.. వారిని చూపించాలనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే మీ చివరి కోరిక ఏంటని ప్రశ్నిస్తే.. వారి వద్ద నుంచి […]

కడచూపుకు రండి.. నిర్భయ దోషుల పేరెంట్స్‌కు సమాచారం..

Edited By:

Updated on: Jan 24, 2020 | 1:45 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార నిందితులకు ఫిబ్రవరి 1వ తేదీన ఉరిశిక్ష అమలుకానుంది. ఢిల్లీలోని పాటియాల కోర్ట్.. ఆదేశాల ప్రకారం.. ఉదయం ఆరుగంటలలోపు ఉరితీసేందుకు.. తీహార్‌జైలు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నలుగురు దోషులు వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌(31), ముఖేష్‌ కుమార్‌ (32), పవన్‌(26)లను ఒకేసారి ఉరితీయనున్నారు.

ఈ నేపథ్యంలో దోషుల కుటుంబ సభ్యులకు.. వారిని చూపించాలనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే మీ చివరి కోరిక ఏంటని ప్రశ్నిస్తే.. వారి వద్ద నుంచి ఎలాంటి సమాదానం లేదని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే ఉరిశిక్ష అమలుకు మరో వారం రోజులే గడువు ఉండటంతో.. దోషుల తల్లిదండ్రులుకు జైలు అధికారులు ఓ సమాచారాన్ని పంపించారు. నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులుగా తేలిన.. వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌(31), ముఖేష్‌ కుమార్‌ (32), పవన్‌(26)లను ఫిబ్రవరి 1న ఉరితీస్తున్నాం. ఈలోపుగా మీరు జైలుకు వచ్చి మీ పిల్లల్ని చూసుకోవచ్చని తెలిపారు.