Thugs Attack Newly Married Couple: కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కడంబ అభయారణ్య సమీపంలో దుండగులు రెచ్చిపోయారు. ఒంటరిగా కనిపించిన యువ దంపతులపై దుండగుల దాడి చేశారు. ద్విచక్రవాహనంపై అంజన్న, మౌనికల అనే కొత్త జంటను వెంబడించిన దుండగులు, దట్టమైన అటవీ ప్రాంతంలోకి రాగానే వారిపై ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డారు. బైక్‌పై నుంచి కిందపడిపోయిన వారి నుంచి మౌనిక మంగళసూత్రం, అంజన్న మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కేళ్లిపోయారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో దంపతులిద్దరూ ప్రాణభయంతో అడవిలోకి పరుగులు తీశారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి అదే దారిలో వెళ్లున్న ట్రాక్టర్ డ్రైవర్.. వారిని గుర్తించి స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాల పాలైన అంజన్న, మౌనికలను కాగజ్‌నగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇరువురికి తలపై తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.