యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హోలీ పండుగ రోజు జరిగిన ఓ అత్యాచార ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గోరఖ్ పూర్‌లో ఓ యువతి తన స్నేహితుడు రాకేష్‌తో కలిసి హోలీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. అయితే అనంతరం ఇద్దరు కలిసి పక్క గ్రామంలో ఉండే తన స్నేహితుల దగ్గరికి వెళ్లి హోలీ ఆడదామంటూ రాకేష్ తన స్నేహితురాలిని కోరాడు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో కాస్త బలవంతం చేశాడు. దీంతో స్నేహితులను కలవడానికే కదా అని.. ఆ అమ్మాయి ఓకే చెప్పింది. రాకేష్ బైక్‌పై పక్క గ్రామానికి బయలుదేరింది. అయితే ఇంతలో మధ్యలో ఓ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. రంగులు పోయేలా కడుక్కుందామంటూ సదరు యువతిని కోరడంతో.. ఓకే చెప్పింది. అయితే అప్పటికే సదరు యువతికి అనుమానం వచ్చినా.. అలాగే చెరువులోకి దిగి రంగులు కడుక్కుంది. అయితే అప్పటి వరకు స్నేహితుడిగా ఉన్న ఆ యువకుడిలో కామాంధుడు బయటికొచ్చాడు. వెంటనే సదరు యువతిని తన కోరికలు తీర్చాలని కోరాడు. దీంతో సదరు యువతి రాకేష్‌ను ఎదిరించి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే పక్కా ప్లాన్ వేసుకున్న రాకేష్.. తన ఇద్దరు స్నేహితులను చెరువు దగ్గరికి రమ్మంటూ మెసెజ్ చేశాడు. దీంతో మరో ఇద్దరు యువకులు కూడా చెరువు దగ్గర ప్రత్యక్షమయ్యారు.
ముగ్గురు యువకులు కలిసి సదరు యువతిని భయబ్రాంతులకు గురిచేశారు. తమ కోరిక తీర్చకపోతే రేప్ చేసి హతమార్చుతామంటూ బ్లాక్ మెయిల్‌కు దిగారు. అప్పటికీ ప్రతిఘటించిన యువతిపై.. రాకేష్ తన స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అయితే ఈ ఘటన అనంతరం మళ్లీ సదరు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు రాకేష్. మరోసారి తన కోరికలు తీర్చాలంటూ వేదింపులకు దిగాడు. దీంతో రాకేష్ వేధింపులు భరించలేక.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్ వేసి నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు.