హైటెక్ సిటీ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వేట్రాక్ పై వెళ్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన రైలు ముగ్గురిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. రైల్వే ట్రాక్ ఫై నడుస్తూ వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతులందరూ వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైలు పట్టాలు దాటేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైల్వే వంతెనలు నిర్మించారు. కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. అందుకే రైలు ప్రయాణం చేసేటప్పుడు గానీ, ట్రాక్ దాటేటప్పుడు గానీ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి