Three killed in Lorry Accident: కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. గన్నవరం మండలం కేసరపల్లి చైన్నై- కలకత్తా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులను తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన కొమ్మేటి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, రోహిత్‌గా గుర్తించారు. బీహార్ నుంచి బెంగళూరుకు బియ్యం లోడ్‌తో లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి స్థానికుల ద్వారా సమాచారమందుకున్న గన్నవరం పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.క్రేన్ సాయంతో లారీని బయటకు తీశారు. చనిపోయిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్లీనర్ లారీ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also… కారు డ్రైవర్‌కు రూ.40 కోట్ల జాక్‌పాట్…!! కానీ, ట్విస్ట్ ఏంటంటే…?? ( వీడియో )