Siddipet Road Accident : సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని జగదేవపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామం వద్ద ఆటోను వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆటో డ్రైవర్ రమేష్ (35 ), ప్రయాణికులు శ్రీశైలం (26), గడ్డం కనకయ్య (35)గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.