Honeytrap: లవ్‌ పేరుతో హానీ ట్రాప్‌ అండ్ కిడ్నాప్‌.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్

|

Aug 21, 2022 | 7:39 AM

హానీ ట్రాప్‌లో (Honeytrap) ఇదో కొత్త రకం స్టైల్‌. లవ్‌ పేరుతో ట్రాప్‌ చేసి కిడ్నాప్‌లకు పాల్పడుతుంది ఓ ముఠా. పంజాబ్‌లో వెలుగుచూసినా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఫోన్‌ చేయడం, కాల్‌ అటెండ్‌ చేయగానే...

Honeytrap: లవ్‌ పేరుతో హానీ ట్రాప్‌ అండ్ కిడ్నాప్‌.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్
Follow us on

హానీ ట్రాప్‌లో (Honeytrap) ఇదో కొత్త రకం స్టైల్‌. లవ్‌ పేరుతో ట్రాప్‌ చేసి కిడ్నాప్‌లకు పాల్పడుతుంది ఓ ముఠా. పంజాబ్‌లో వెలుగుచూసినా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఫోన్‌ చేయడం, కాల్‌ అటెండ్‌ చేయగానే హస్కీ వాయిస్‌తో మాట్లాడటం, ఆ తర్వాత ట్రాప్‌ చేయడం, డబ్బు గుంజడం, ఇదీ ఇప్పటివరకు చూసిన హానీ ట్రాప్‌ స్టైల్‌. అయితే, పంజాబ్‌లో దిమ్మతిరిగిపోయే విధంగా హానీ ట్రాప్‌ జరిగింది. హానీ ట్రాప్‌ మోసాలు ఏ రేంజ్‌లో ఉంటాయో, ఎంతకు తెగిస్తారో మరోసారి కళ్లు తెరిపించే ఇన్సిడెంట్ ఇది. ఓ ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ను లవ్‌ పేరుతో హానీ ట్రాప్‌ చేయడమే కాదు, ఏకంగా కిడ్నాపే చేశారు. పంజాబ్‌లో (Punjab) తీవ్ర సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో కీలక విషయాలు గుర్తించారు. కిడ్నాప్ కు గురైన యువకుడిని సురక్షితంగా కాపాడారు. హానీ ట్రాప్‌ కిలాడీ రాఖీ.. ఫేస్‌బుక్‌లో ఫేక్‌ ప్రొఫైల్ క్రియేట్‌ చేసి ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ భూమ్లాను ట్రాప్‌ చేసింది. ఆమె మాటలు నమ్మి కలిసేందుకు బయల్దేరిన భూమ్లాను తన గ్యాంగ్‌తో కిడ్నాప్‌ చేయించింది.

ఆ తర్వాత మత్తు మందు ఇచ్చి, రంజిత్‌నగర్‌లోని తన ఫ్లాట్‌లో తాళ్లతో కట్టి పడేసింది. ఆ తర్వాతే అసలు గేమ్‌ స్టార్ట్ అయింది. భూమ్లా పేరెంట్స్‌కి ఫోన్‌చేసి మీ అబ్బాయిని కిడ్నాప్‌ చేశాం, రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. భూమ్లా తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్‌తో రెండ్రోజుల సెర్చ్‌ ఆపరేషన్‌ తర్వాత ఆ యువకుడిని పోలీసులు సేఫ్‌గా కాపాడారు రంజిత్‌నగర్‌లోని రాఖీ ఫ్లాట్‌లో కట్టిపడేసిన భూమ్లాను రక్షించారు. అనంతరం, హానీ ట్రాప్‌ కిలాడీ లేడీ రాఖీతోపాటు నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేశారు.

నిందితుల నుంచి హోండా సిటీ కారు, పిస్టోల్‌తో పాటు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ హానీ ట్రాప్‌ కేసును ఛేదించడానికి మూడు జిల్లాల పోలీసులు రెండ్రోజులపాటు కష్టపడాల్సి వచ్చింది. అంబాలా, హరిద్వార్‌, ఘజియాబాద్‌ జిల్లాల పోలీసులు సమన్వయంతో పనిచేసి ఈ హనీట్రాప్‌ ముఠా గుట్టు రట్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి