Hyderabad Crime: ఫేస్‌బుక్‌తో గాలం.. కాలేజీ సీటు ఇప్పిస్తానని చెప్పి మోసం.. అడిగితే బ్లాక్‌ మెయిల్‌

|

Sep 19, 2021 | 10:27 AM

Hyderabad Crime: ఫేస్‌బుక్‌తో అందమైన అమ్మాయిలకు గాలం వేయడం.. చనువుగా మెదిలి అందినకాడికి దండుకోవడం.. అడిగితే బ్లాక్‌ మెయిల్‌ చేయడం అతడి హాబి.

Hyderabad Crime: ఫేస్‌బుక్‌తో గాలం.. కాలేజీ సీటు ఇప్పిస్తానని చెప్పి మోసం.. అడిగితే బ్లాక్‌ మెయిల్‌
Facebook Frad
Follow us on

Hyderabad Crime: ఫేస్‌బుక్‌తో అందమైన అమ్మాయిలకు గాలం వేయడం.. చనువుగా మెదిలి అందినకాడికి దండుకోవడం.. అడిగితే బ్లాక్‌ మెయిల్‌ చేయడం అతడి హాబి. ఇలా రోజు రోజుకు రెచ్చిపోతున్న అతడి ఆగడాలకు అడ్డుకట్టపడింది. పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వరంగల్‌ జిల్లా మహబుబాబాద్‌కు చెందిన సందీప్‌కుమార్‌ వేమిశెట్టి అలియాస్‌ అభినవ్‌కుమార్‌ (34) ఇంటర్మీడియట్‌ చదివాడు. 2014లో హైదరాబాద్‌కు వచ్చి క్యాటరింగ్‌ పనిచేశాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని, కాలేజీల్లో సీటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నాడు.

తాజాగా చందానగర్‌కి చెందిన ఓ అమ్మాయిని కూడా ఇదే విధంగా ట్రాప్ చేశాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి.. మెల్లగా మాటలు కలిపాడు. తీయగా మాట్లాడుతూ ఆమెను బుట్టలో వేసుకునేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఓ కళాశాలలో ఎన్‌ఆర్‌ఐ కోటలో బీఫార్మసీ సీటు ఇప్పిస్తానని నమ్మించి రూ.46 వేలు వసూలు చేశాడు. సదరు యువతి సీటు గురించి అడుగుతుండగా మాట మార్చుతూ కొన్ని రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి సదరు వ్యక్తిని నిలదీసి పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో అతడి అసలు గుట్టు బయటపడింది.

అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు తన వద్ద ఉన్న ఆమె ఫొటోలను అందరికీ షేర్‌ చేస్తానని బెదిరించాడు. బీఫార్మసీ సీటు కోసం తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని బెదిరించాడు. దీంతో బాధితురాలు చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో సందీప్‌కుమార్‌ ఆచూకీ తెలుసుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Wedding: పెళ్లైన అరగంటకే ట్విస్ట్‌.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లి అదృశ్యమైన వధువు.. ఆ తర్వాత..

Crime News: మరదలితో పెళ్లి చేయలేదని అత్తామామలపై కోపం.. నలుగురు కుమార్తెలకు విషమిచ్చి.. దారుణంగా..

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..