హైదారాబాద్‌లో దారుణం జరిగింది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఓ భార్త ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ సూసైడ్ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సరూర్ నగర్‌కు చెందిన గూడూరు శేఖర్‌కు 2014లో వివాహం జరిగింది. ఓ కూతురు, కొడుకు ఉన్నారు.
భార్య హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో వర్క్ చేసే సమయంలో.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు శేఖర్. 2019 నుంచే వారి మధ్య సంబంధం ఉందని..అప్పుడు తప్పు ఒప్పుకొని పెద్దల సమక్షంలో క్షమాపణ కూడా కోరిందని చెప్పారు శేఖర్ తండ్రి చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఏడాది జనవరిలో ట్రాన్స్‌ఫర్‌పై ఆదిలాబాద్ వెళ్లిన ఆమె.. అక్కడ మళ్లీ అతనితో కలిసి సహజీవనం చేస్తోందని.. అది నచ్చకే తన కొడుకు శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నాడు.
చివరకు శేఖర్‌ను తన పిల్లలను కూడా చూసుకోనివ్వలేదని ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుని, తన కొడుకు మరణానికి కారణమైన వారిద్దరిని కఠినంగా శిక్షించాలని శేఖర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే శేఖర్ సెల్ఫీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..