Hyderabad Lorry Driver హైదరాబాద్ నగర శివారులో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దుర్మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తను నడిపే లారీ క్రింద పడి దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. లారీ సెల్ఫ్ మోటర్ పనిచేయకపోవడంతో కిందకు దిగి చెక్ చేసే సమయంలో లారీ ఒక్కసారిగా స్టార్ట్ కావడంతో అతనిపై నుంచి దూసుకుపోయింది. దీంతో అతడు అక్కడిక్కక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపాలాపల్లి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also…. Viral Video: బైక్‌తో స్టంట్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే సీన్ రివర్సయింది.. సోషల్ మీడియాలో ట్రెండింగ్!