ఆర్థిక భారంతో ఆత్మహత్యలు.. దేశవ్యాప్తంగా మూడో స్థానంలో తెలంగాణ

ఆర్థిక కష్టాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా గత సంవత్సరం భారీగా పెరిగింది. 2018తో పోల్చితే 2019లో ఈ సంఖ్య 3.5 శాతం మేర పెరిగిందని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది.

ఆర్థిక భారంతో ఆత్మహత్యలు.. దేశవ్యాప్తంగా మూడో స్థానంలో తెలంగాణ

Updated on: Sep 05, 2020 | 3:08 PM

దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రైతుల కంటే నిరుద్యోగులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడి అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్‌ క్రైంరికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఆత్మహత్యలపై నిర్వహించిన సర్వేలో పలు ఆశ్చర్యకర అంశాలు వెల్లడయ్యాయి. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం.. దేశంలో ప్రతి గంటకు ఒకరి చొప్పున బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు.

ఆర్థిక కష్టాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా గత సంవత్సరం భారీగా పెరిగింది. 2018తో పోల్చితే 2019లో ఈ సంఖ్య 3.5 శాతం మేర పెరిగిందని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. తెలంగాణ 989 ఆత్మహత్యలతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. 1,526 కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానం ఆక్రమించగా.. 1,432 కేసులతో కర్ణాటక ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఆర్థిక కష్టాల వల్ల జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో 67 శాతం కేసులు ఈ మూడు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశంలో ఆత్మహత్యలకు ప్రధానంగా కుటుంబ సమస్యలే కారణమని, ఇందువల్ల 32.4 శాతం మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 17.1 శాతం మంది అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది. కాగా, ఆ ఏడాది కరోనా ప్రభావంతో ఉపాధి అవకాశాలు కోల్సోయి ప్రాణాలు తీసుకుంటున్నవారు కొందరతే, మరికొందరు కరోనా ను జయించలేక ప్రాణాలు తీసుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుంది.