Dancer Suicide: నా కోరిక నెరవేర్చండి.. ప్రధాని మోదీకి లేఖ రాసి.. యువ డ్యాన్సర్ అఘాయిత్యం.. ఎందుకంటే..?

|

Oct 12, 2021 | 11:13 AM

Teenage boy suicide: తాను గొప్ప డ్యాన్సర్ కావాలని కలలు కన్నాడు.. కానీ.. ఆ కల తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు..  ప్రతిభ ఉన్నా.. తన లక్ష్యాన్ని

Dancer Suicide: నా కోరిక నెరవేర్చండి.. ప్రధాని మోదీకి లేఖ రాసి.. యువ డ్యాన్సర్ అఘాయిత్యం.. ఎందుకంటే..?
Suicide
Follow us on

Teenage boy suicide: తాను గొప్ప డ్యాన్సర్ కావాలని కలలు కన్నాడు.. కానీ.. ఆ కల తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు..  ప్రతిభ ఉన్నా.. తన లక్ష్యాన్ని సాధించుకోలేపోతున్నానని మనస్థాపం చెంది.. ప్రధాని మోదీకి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో చోటుచేసుకుంది. గ్వాలియర్​ పట్టణానికి చెందిన 16 ఏళ్ల యువకుడు అజ్జు 11వ తరగతి చదువుతున్నాడు. గొప్ప డ్యాన్సర్ కావాలని కలలు కన్నాడు. దానికోసం నిరంతరం ప్రాక్టిస్ సైతం చేసేవాడు. అయితే.. అజ్జు డ్యాన్సర్ కావడం అతని తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. చదువు మీద శ్రద్ధ పెట్టమంటూ తరచూ మందలించేవారు. తనకు కుటుంబసభ్యులు, స్నేహితులు సహకరించడం లేదని తీవ్ర మనస్తాపం చెందిన అజ్జు ఆదివారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరకున్న ఝాన్సీ రోడ్ పోలీసులకు అజ్జు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది.

దానిలో అజ్జు తన ఆవేదనను వెల్లడించాడు. తాను మంచి కొడుకును కాలేపోయినందుకు అమ్మా, నాన్న క్షమించాలంటూ కోరాడు. తాను గొప్ప డ్యాన్సర్‌ని కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నానని.. దానికి ఎవరూ సపోర్ట్ చేయలేదన్నాడు. తన ఇష్టాలేవీ ఎవరికీ నచ్చవని.. అందుకే నేను చనిపోతున్నానని.. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదంటూ లేఖలో రాశాడు. దీంతోపాటు ప్రధాని మోదీకి కూడా విన్నపమని.. తన చావు తర్వాత తనపై ఒక పాట రాయించాలని కోరాడు. దేశంలోనే అతి పెద్ద సింగర్ అయిన అర్జిత్ సింగ్‌తో ఆ పాటను పాడించాలని.. నేపాల్‌కు చెందిన ప్రముఖ డ్యాన్సర్ సుశాంత్ కత్రి సొంత కొరియోగ్రాఫీతో ఆ పాటకు డ్యాన్స్ చేయాలని కోరాడు. తన చివరి కోరిక నెరవేర్చితేనే తన ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్నాడు. తన ఈ చిన్న కోరికను తీర్చాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ లేఖలో రాశాడని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఝాన్సీ రోడ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సంజీవ్ నయన్ శర్మ పేర్కొన్నారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో యువకుడి శరీరం రెండు భాగాలుగా తెగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Cruise Drug Case: ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్ చిట్ లేదు అంటున్న ఎన్సీబీ.. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం!

Hyderabad: అప్పుడు మోసం చేశాడు.. ఇప్పుడు అనుభవిస్తున్నాడు.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..?