అక్రమ మద్యంతో పట్టుబడిన అధ్యాపకులు.. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు.. ఎక్కడో తెలుసా..?
Teachers Caught Selling Illegal Alcohol : సులువుగా డబ్బు సంపాదించడం కోసం అధ్యాపకులు సైతం అడ్డదారులు తొక్కుతున్నారు. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. ఉన్నత
Teachers Caught Selling Illegal Alcohol : సులువుగా డబ్బు సంపాదించడం కోసం అధ్యాపకులు సైతం అడ్డదారులు తొక్కుతున్నారు. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. ఉన్నత విద్యావంతులు పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పి ఓ దారికి తీసుకొస్తారనుకుంటే.. వారే అక్రమ దందా నిర్వహిస్తూ దొరికిపోతున్నారు. జల్సలాలకు అలవాటు పడిన కొంతమంది అధ్యాపకులు అక్రమ మద్యం తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ఈ ఘటన అధ్యాపక వృత్తికి మాయని మచ్చగా మిగిలిపోయింది. సౌత్ సెంట్రల్ రైల్వే క్యాంటీన్ వర్కర్ రావూరి సాయికృష్ణ, పట్టణంలోని ఎస్‌వీఆర్ డిగ్రీ కళాశాల కామర్స్ అధ్యాపకుడు పొందుగల శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గంటా శ్రీనివాసరావు, వంట మాస్టార్ షేక్ వలీ ఒక బృందంగా ఏర్పడి నిత్యం రైల్లో తెలంగాణ మద్యం తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ఆంధ్రాలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ కొనుగోలు చేయాలంటే మందబాబులు జంకుతున్నారు.
దీంతో తెలంగాణ మద్యానికి అలవాటు పడుతున్నారు. అయితే తెలంగాణలో మద్యం ధరలు ఆంధ్రాతో పోలిస్తే కాస్త తక్కువగా ఉండటంతో నిందితులు దీనిని మంచి బిజినెస్‌గా మార్చుకున్నారు. తక్కువ ధరకు తెలంగాణలో మద్యం కొనుగోలు చేసి రైళ్ల ద్వారా వాటిని తరలిస్తున్నారు. అనంతరం వాటిని సిండికేట్ గా మారి సత్తెనపల్లిలో అధిక ధరలకు విక్రియిస్తున్నారు. ముందస్తు సమాచారం ప్రకారంపోలీసులు రాత్రి దాడులు నిర్వహించారు. పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాల్లో మద్యం సీసాలు పెట్టుకుని విక్రయిస్తుండగా.. పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.