వరంగల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రైవేట్ స్కూల్ టీచర్ 9వ తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసగించినందుకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోకిల సత్యనారాయణగౌడ్ కథనం ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెళ్తుర్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని వరంగల్ నగరంలోని ప్రొబెల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా, హన్మకొండ రాంనగర్‌కు చెందిన సాయి మణిదీప్ భౌతికశాస్త్రం బోధించేవాడు.
యూనిట్ టెస్ట్‌లో ఎక్కువ మార్కులు వేస్తానని నమ్మించి బాధిత బాలికతో చనువు పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ఆమెనును హైదరాబాద్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో గణఫురం పోలీసుల టీచర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువైందని భావించిన న్యాయస్థానం ముద్దాయికి పదేళ్ల జైలు శిక్ష, రూ.4500 జరిమానాతో పాటు రూ. 2 లక్షల నష్టపరిహారం బాధిత బాలికకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి..