సీరియల్స్‌లో నటించే.. అన్నాచెల్లెలు ఆత్మహత్య

| Edited By:

Jun 07, 2020 | 9:10 AM

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా ముంబయి, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో టీవీ నటులు షూటింగులు లేక, చేతిలో డబ్బుల్లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలానే గత మూడు నెలల నుంచి షూటింగ్స్ లేకపోవడంతో..

సీరియల్స్‌లో నటించే.. అన్నాచెల్లెలు ఆత్మహత్య
Follow us on

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా ముంబయి, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో టీవీ నటులు షూటింగులు లేక, చేతిలో డబ్బుల్లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలానే గత మూడు నెలల నుంచి షూటింగ్స్ లేకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులతో సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలోని కొడంగయ్యూర్‌లో జరిగింది.

టీవీ సీరియల్స్‌లో నటించే అన్నాచెల్లెళ్లు, శ్రీధర్, జయ కళ్యాణి ఆత్మహత్య చేసుకున్నారు. వారు నివసిస్తున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా.. అన్నాచెల్లెళ్ల మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. వీరు ఆత్మహత్య చేసుకొని కొన్ని రోజులు అయి ఉంటుందని పోలీసులు భావించారు. కాగా కొన్ని సీరియల్స్‌లో నటించి.. అప్పుడప్పుడే మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అయితే ఈ వైరస్ లాక్‌డౌన్ కారణంగా వారికి ఉపాధి దొరకలేదని, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు పోలీసులు. అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More:

ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వామ్మో.. 70 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..