ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం.. నల్గొండలో ఘటన!
నల్గొండ: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అన్నారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

వేముల వీరేశం ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వాహనం ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తూ వేముల వీరేశం క్షేమంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అనుచరులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..